చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కించనున్న 'చిరు 156' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రబృందం ఓ వీడియో అప్టేడ్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని మొదట ఓ సెలెబ్రేషన్ సాంగ్ రీ రికార్డింగ్ పనులతో స్టార్ట్ చేశామని, సినిమాలో ప్రస్తుతానికి 6 పాటలు ఉన్నాయని ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న ఎంఎం కీరవాణి తెలిపారు. కె రాఘవేంద్రరావు క్లాప్‌తో ఈ చిత్రం ప్రారంభించారు.