Nov 24,2022 15:34
  • స్తంభించిన తొలకరి పనులు
  • అయోమయంలో రైతన్నలు

ప్రజాశక్తి రామచంద్రపురం (కోనసీమ) : వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గురువారం కూడా వర్షాలు కురవడంతో తొలకరి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటికే నూర్పిడి పూర్తయిన ధాన్యం రోడ్ల వెంట ఎగుమతుల కోసం ఎదురుచూస్తుండగా వర్షాలు తగ్గకపోవడంతో రైతన్నలు కలవరం చెందుతున్నారు. గురువారం ఉదయం కొద్దిసేపు తెరిపివ్వడంతో ఊపిరి పీల్చుకున్న రైతులకు మధ్యాహ్నం మళ్లీ భారీ వర్షం కురవడంతో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి దీంతో పనులపై ఉన్న వరి చెలలో వరి పనలు మళ్ళీ తడిసిపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మరో రెండు మూడు రోజులు ఎండ కాస్తే గాని తొలకరి పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఇప్పటికే మాసూలు చేసిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని పలు రైతులకు తేమ శాతం 17 వరకు ఉంటేనే ఎగుమతులు జరిగే అవకాశం ఉండటంతో ప్రస్తుత వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండడంతో ఎగుమతులకు వీలు కలిగే అవకాశం కానరాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు కోతకు సిద్ధమైన వరిచేలు సకాలంలో కోయకపోవడంతో తొలకరి రైతులకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. రామచంద్రపురం కే గంగవరం మండలంలో ఇప్పటికి 50 శాతం మాత్రమే తొలకరి కోతలు పూర్తికాగా మరో 50% పనులు పూర్తి కావాల్సి ఉంది.

danyam