చిరుతపై కనిపించే చుక్కలు
సప్తవర్ణాల పక్షుల ఈకలు
నీటిలో కదిలాడే చేపల రంగులు
పండ్లపై ఉండే పొరలు..
సృష్టి కళాత్మక ధోరణి బోధపడుతుంది
కొమ్మల్లో కోయిలమ్మల పాటలు
కొండకోనల్లో చిరుగాలుల సవ్వడులు
విత్తులు విత్తనాల రంగులు
సెలయేర్ల సరిగమలను చూస్తే
సృష్టి నైపుణ్యం బోధపడుతుంది
ఉత్సుకత నిండిన మనసులు
పనులను భిన్నంగా చేసే ఆలోచనలు
ఆత్మశక్తి ఆవహించిన ప్రవర్తనలు
ఏటికి ఎదురీదే ధైర్యాలను చూస్తే
సృష్టి దూరదృష్టి బోధపడుతుంది
మంచు పొగలోని చల్లని రాగాలు
ఆవుదూడల ప్రేమైక పిలుపులు
పచ్చని చెట్ల యుగళ గీతాలు
కోవెల జే గంటల
ప్రతిధ్వనులు చూస్తే..
సృష్టి ధర్మం బోధపడుతుంది
వెదురు వేణువులోని సరిగమలు
చిట్టి చీమల్లోని
శ్రమ జీవన సౌందర్యాలు
సాలీడులోని అల్లిక చతురతలు
గిజిగాడి గూడులో ఘనమైన నైపుణ్యాలు చూస్తే..
సృష్టి (వి)చిత్రం బోధపడుతుంది
పిల్లి హజరత్తయ్య
98486 06573