Sep 24,2023 19:30

మొన్నటి వరకు టాలీవుడ్‌ లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌ అంటే పూజానో, రష్మికనో అని అని చెప్పేవారు. కానీ ప్రస్తుతం శ్రీలీల పేరే వినబడుతుంది. నటనతో పాటు డ్యాన్స్‌ లు కూడా అదరగొట్టడంతో యూత్‌ లో తిరుగులేని క్రేజ్‌ తెచ్చుకుంది. తెలుగువారు సైతం శ్రీలీల జపమే చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అవి కూడా అశా మాశీ ప్రాజెక్ట్‌ లు కావు. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు వంటి స్టార్లకు జోడీగా నటిస్తుంది. అంతేకాకుండా శ్రీలీల బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో యమ బిజీగా గడుపుతుంది. ఏ రోజు ఏ సినిమా సెట్‌ లో సందడి చేస్తుందో ఎవరు ఊహించలేకపోతున్నారు.శ్రీలీల సైతం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని ఫాలో అవుతూ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను ఓకే చేసింది. అయితే ఒకేసారి అన్ని సినిమాలు సెట్స్‌పైకీ తీసుకెళ్లడంతో డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయడం చాలా కష్టమైపోతుందట. ఈ క్రమంలో విజరు దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా నుంచి ఈ బ్యూటీ తప్పుకున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. దీనిపై క్లారిటీ రావలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ గుంటూరు కారంతో పాటు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, స్కంద, భగవంత్‌ కేసరి, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌, ఆది కేశవ వంటి సినిమాలను లైన్‌లో పెట్టింది. వీటితో పాటుగా కన్నడలోనూ రెండు సినిమాలు చేస్తుంది.