May 07,2023 07:47

శ్రీ శ్రీ కవిత్వం ప్రజల నాలుకలపై నాట్యం,
ప్రాచీన సాహిత్యాన్ని ఔపోశన పట్టిన వైనం,
అవినీతిని, అణచివేతను తెగనాడిన
విప్లవ భావం,
సరళమైన భాషలో లోతైన
భావుకత అందించిన కావ్యం

ప్రపంచపు బాధంతా
తన బాధగా ఆపాదించుకున్న మహాకవి..
వచన కవుల మార్గదర్శి
శరణు అన్న అన్నార్తుల,
అభాగ్యులకై తన జీవితం
అంకితం చేసిన దయార్త హృదయుడు..

శ్రమైక జీవనాన్ని కొనియాడిన నవయుగకవి
బలహీన వర్గాల అరుణోదయ కిరణం
బడుగు దీన బతుకులలో
కాంతిని చేకూర్చిన కాంతి పుంజం

ఆయన జీవితం.. చీకటి, ఆకలి,
కటిక దారిద్య్రం
పూలు, ధనం, గౌరవం,
అజరామర కీర్తి వైభవం..
ఒక మహాప్రస్థానం.

ఎన్‌.రాజేష్‌, 9849335757