కలం అనే హలంతో
కుళ్లు పట్టిన ఈర్ష్యాద్వేషపు
పెచ్చుమీరుతున్న
కిరాతక దుర్మార్గపు
కలుపు మొక్కల్ని దున్నేసి
స్నేహమనే విత్తుల్ని నాటి
చీడపట్టిన సంఘాన్ని
కీటకనాశిననే సిరాతో పిచికారీ చేసి
సువర్ణాక్షరాలనే ధాన్యాన్ని పండించి
సస్యశ్యామలపు సౌభ్రాతృత్వపు
నవ సమాజాన్ని స్థాపిద్దాం
జాతిని జాగృతి చేద్దాం
పసిడి కిరణాల పసుపుపచ్చని
సూర్యోదయాన్ని చూద్దాం
ఆకుపచ్చని మానవీయ
నందనవనాల్ని సృష్టిద్దాం
భావితరాల హృదయాల్లో స్ఫూర్తి నింపుదాం
- నాగముని.యం,
94908 56185