ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు (డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్)లో పనిచేస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్లకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.15 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 652ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ జిఓ పట్ల ఎపిజిఇఎఫ్ స్టేట్ జాయింట్ సెక్రటరీ రోహిత్ కామటి, ఎపివివిపి డాక్టర్స్ జెఎసి సెక్రటరీ వి జయప్రకాష్ హర్షం వ్యక్తం చేశారు.










