Aug 23,2023 14:20

ప్రజాశక్తి-నందలూరు(అన్నమయ్యజిల్లా) : నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అన్నమయ్య యువశక్తి సేవ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పునగాని గుణ యాదవ్‌ తన తండ్రి సబ్బ నరసింహులు జ్ఞాపకార్థం రూ.20వేల విలువ గల ఎల్‌ఈడి టీవీని ఎంపీపీ మేడ విజయభాస్కర్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్‌ సృజన, డాక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎంపీపీ మేడ విజయభాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే వైద్య సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి హాస్పిటల్‌లో ఎల్‌ఈడి టీవీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ మెంబర్‌ కలీం ఖాన్‌, హిమగిరి నాథ్‌ యాదవ్‌,ఆనంది వేణు గోపాల్‌, పెనుబాల నాగసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.