మొగదిషు : సోమాలియాకు చైనా ప్రభుత్వం భారీ సాయం అందించింది. తీవ్ర సంఘర్షణ, జాతీయ విపత్తులతో అల్లాడుతున్న సోమాలియా ప్రజలకు సహాయం అందించేందుకు చైనా 150,000 అమెరికన్ డాలర్ల (సుమారు 12 మిలియన్లుకి పైగా)సాయం అందించినట్లు సోమాలి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజన్సీ (ఎస్‌ఒడిఎంఎ) ప్రకటించింది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు సజీవంగా నిలిచేందుకు ఇది తోడ్పడుతుందని ఎస్‌ఒడిఎంఎ కమిషనర్ మొహమ్మద్ మొల్లిమ్ అబ్దుల్ పేర్కొన్నారు. చైనా నుండి సాయం అందుకోవడం ఇదే మొదటిసారికాదని, చైనా మరియు సోమాలియాలు చారిత్రకంగా సహాయ సంబంధాలను కొనసాగిస్తున్నాయని అన్నారు. విపత్తుల, యుద్ధ, సంఘర్షణ బాధితులకు మద్దతునందించడంతో సోమాలియాతో సహకారాన్ని బలోపేతం చేయడంలో చైనా ప్రభుత్వం తన నిబద్ధతను చూపుతోందని చైనా రాయబారి ఫీ షెంగ్ చావో పేర్కొన్నారు. చైనా మరియు సోమాలియాలు దీర్ఘకాల సంబంధాలను కలిగి ఉన్నాయని అన్నారు.