- మంత్రి రాజా ఇంటికి సిఐటియు నాయకులు
- నాయకుల అరెస్టు.. స్టేషన్‌కు తరలింపు
ప్రజాశక్తి కోటనందూరు(కాకినాడ) : భవన కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి మంత్రి దాడిశెట్టి రాజా ఇంటికి ర్యాలీగా వెళ్తున్న సిఐటియు నాయకులను, భవన నిర్మాణ కార్మికులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రాజకుమార్, నక్కల శ్రీనివాస్ , ఎస్.కె పద్మ మాట్లాడుతూ.. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న కార్మికులను అరెస్టు చేయడం దారుణమన్నారు. మంత్రి రాజాకు వినతి పత్రాన్ని అందజేసి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాడాన్ని పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. భవన నిర్మణ కార్మికులను కోటనందూరు పోలీస్ స్టేషన్‌కు 25 మందిని తరలించగా, మరి కొంతమందిని ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.











