అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి : ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎం.వంశీకృష్ణ
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : సమాజంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి అవుతుందని ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ ఎం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ... స్థానిక ఎస్‌ఎల్‌ఎం చైతన్య హై స్కూల్ లో ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్యం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో వంశీకఅష్ణ మాట్లాడుతూ ... దేశంలో ఉన్న పాలకులు ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. ఆరోగ్యం అందరికీ ప్రాథమిక హక్కు అని అన్నారు. ముఖ్యంగా పిల్లలకు జింక్ ఫుడ్ అందించకూడదని చెప్పారు. న్యూట్రిషన్, పాలు, పండ్లు, నట్స్ పీచు పదార్థములు ఉండే ఆహారాలను పిల్లలకు అందించాలని కోరారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. శారీరక క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య వేదిక డివిజన్ కార్యదర్శి ఏ జయరాజు, హై స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య వేదిక సహాయ కార్యదర్శి ఎం నాగేశ్వరావు, ఎస్ చందు తదితరులు పాల్గొన్నారు.










