జొహానెస్‌బర్గ్: 'మూడవ ఇంటర్నేషనల్ డైలమాస్ ఆఫ్ హ్యుమానిటీ' పేరుతో ఈ నెల 14 నుండి 18 వరకు జొహానెస్‌బర్గ్‌లోని కాన్స్టిట్యూషన్ హిల్‌లో వామపక్ష నేతల సదస్సు జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజా ఉద్యమాలు, వామపక్ష రాజకీయ పార్టీల నాయకులకు సోషలిజం ఏం చేస్తుంది, సోషలిజాన్ని నిర్మించడమంటే ఏమిటి? అన్నదానిపై స్పష్టత కల్పించడమే ఈ సదస్సు ఉద్దేశం. ఈ సదస్సులో దాదాపు 500 మంది ఉద్యమ నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, 70కి పైగా దేశాలకు చెందిన వామపక్ష పార్టీల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ సదస్సు నిర్వాహకులుగా ఇంటర్నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ (ఐపిఎ) వ్యవహరిస్తుండగా, దీనికి నేషనల్ యూనియన్ ఆఫ్ మెటల్‌వర్కర్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (నుమ్సా), అబహ్లాలీ బేస్ మ్జోండోలో, సోషలిస్ట్ రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఆతిధ్యమిచ్చాయి.
నుమ్సా అధ్యక్షుడు ఆండ్రూ చిర్వా ప్రారంభ పలుకులతో మొదటి రోజు సమావేశం ప్రారంభమైంది, '' సహజవనరులను దోపిడీ చేయడం, కష్టజీవులు, పేదలు, గ్రామీణ రైతులు , మూలవాసీలను దోపిడీ చేయడం ద్వారా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడ సాగిస్తుంది, అభివద్ధి చెందుతుంది. కార్మికవర్గం నుంచి, పేదల శ్రమ నుంచి పిండుకున్న గరిష్ట విలువను వారికి చెల్లించకుండా ఇది తన జేబులో వేసుకుంటుంది ఈ సంక్షోభాన్ని అధిగమించి, సోషలిజాన్ని ఎలా నిర్మించాలో ప్లాన్ చేసేందుకు ఈ సదస్సు ఒక వేదిక అవుతుందని ఆయన అన్నారు. ఆ తర్వాత పాలస్తీనాలో ప్రస్తుత పరిస్థితిపై సదస్సు చర్చించింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విచక్షణారహిత బాంబు దాడిని అది ఖండించింది. పాలస్తీనా ఆక్రమణను అంతం చేయడానికి అంతర్జాతీయ సంఘీభావ ఉద్యమాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి అనే అంశంపై చర్చలో పాలస్తీనా ఉద్యమకారులు లీలా ఖలీద్, పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా సభ్యురాలు, పాలస్తీనియన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధి అర్వా అబు హష్హాష్. అలాగే దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలేడి పండోర్, దక్షిణాఫ్రికా మాజీ ఇంటెలిజెన్స్ మంత్రి , జాతి వివక్షా వ్యతిరేక పోరాటంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సాయుధ విభాగం వ్యవస్థాపక సభ్యుడు రోనీ కాస్రిల్స్,,క్లాడియా డి లా క్రజ్ తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం సెషన్‌లో 'సోషలిజం బిల్డింగ్ టుడే' అనే అంశంపై ప్రతినిధులు చర్చించారు. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు సోషలిస్ట్ పరిష్కారాలను కనుగొనడం గురించి ప్రతినిధులు నిర్దిష్ట అనుభవాలను పరస్పరం తెలియజేసుకున్నారు.
రెకోలేటా మునిసిపాలిటీ మేయర్, చిలీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు డేనియల్ జాడ్యూ, తన మునిసిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్యం, గహ ప్రవేశం వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు ఎలా కృషి చేసిందీ వివరించారు.. ''సోషలిజం అనేది ఒక అవకాశం మాత్రమే కాదు, అదే మార్గం '' అని రెకోలేటా మేయర్ ప్రకటించారు.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 1949 నుండి సోషలిజం వైపు తన స్వంత మార్గాన్ని నిర్మిస్తోంది,అనేక దశలను దాటింది. ఎన్నో పురోగతులు, ఎన్నో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతోంది'' అని డాంగ్‌షెంగ్ న్యూస్ కలెక్టివ్‌కి చెందిన టింగ్స్ చక్ తెలిపారు.
వెనిజులాలోని సైమన్ బొలివర్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్మెన్ నవాస్, మార్క్సిస్ట్ చరిత్రకారుడు విజరు ప్రసాద్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.