Jul 26,2023 21:15

-ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆగస్టు 1న చేపట్టనున్న మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడిని జయప్రదం చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫెడరేషన్‌ ఆధ్వర్యాన ఈ నెల 27న చేపట్టాల్సిన మున్సిపల్‌ కార్యాలయాల ముట్టడిని వర్షాల వల్ల ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, ఇంజినీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్క్‌ అలవెన్సులు, సంక్షేమ పథకాలు, క్లాప్‌ డ్రైవర్లకు వేతనంగా రూ.18,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.