సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'చిత్తా' తెలుగులో అక్టోబరు 6న విడుదలవుతోంది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో 'చిత్తా' పేరుతో సెప్టెంబరు 28న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ జారీచేసింది. సహస్ర శ్రీ, నిమిషా విజయన్, అంజలి నాయర్, ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధిబు నినాన్ థామస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.










