Jun 14,2023 21:05
  • ఆలిండియా టాప్‌ ర్యాంక్‌ కైవసం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : నీట్‌ 2023 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు ఆల్‌ ఇండియా టాపర్లుగా నిలిచి సత్తా చాటారు. తమ విద్యార్థి బోర వరుణ్‌ చక్రవర్తి ఆల్‌ ఇండియా స్థాయిలో 720కి 720 మార్కులను సాధించి ఓపెన్‌ కేటగిరీలో 1వ ర్యాంక్‌ను సాధించారని వెల్లడించింది. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌, ఇన్ఫినిటీ లెర్న్‌ ఫౌండర్‌ సుష్మ మాట్లాడుతూ.. యస్‌ వరుణ్‌ 715 మార్కులతో 9వ ర్యాంక్‌ను సాధించారన్నారు. శశాంక్‌ కుమార్‌ 14వ ర్యాంక్‌ను, రఘురామ్‌ రెడ్డి 15వ ర్యాంక్‌ను పొందారని వెల్లడించారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ 15లోపు 4, టాప్‌ 50లోపు 9, టాప్‌ 100లోపు 15 ర్యాంకులు, అలాగే వివిధ కేటగిరీల్లోనూ టాప్‌ 10లోపు 11, టాప్‌ 100 లోపు 79 ర్యాంకులు ఒక్క శ్రీచైతన్యనే సాధించిందన్నారు. 700 మార్కులు ఆపైన 54 మంది విద్యార్థులు పొందారన్నారు. ఇది శ్రీ చైతన్య ఆధిపత్యానికి నిదర్శనమన్నారు. అందువల్లే దేశ వ్యాప్తంగా నీట్‌ ప్రవేశాల కోసం విద్యార్థులు శ్రీచైతన్యను కోరుకుంటున్నారన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత బిఎస్‌ రావు అభినందనలు తెలిపారన్నారు.