Sep 12,2023 15:57

ఇంటర్నెట్‌డెస్క్‌ : సీజనల్‌గా దొరికే బెండకాయని కొంతమంది ఇష్టంగా తింటారు. మరికొంతమంది జిగురుగా ఉందని దూరం పెడతారు. కూరగాయల్లో.. తాజాగా ఉండే బెండకాయపైన ఎవరికెన్ని అభిప్రాయాలున్నా.. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బెండకాయ తింటే బ్లడ్‌ షుగర్‌ అదుపులో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. వారంలో రెండురోజులు బెండకాయని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

- బెండకాయని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు తక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలాగే బెండకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలుల్ని అదుపులో ఉంచేందుకు దోహదపడుతుంది.

- బెండకాయలో విటమిన్‌ ఎ ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది.

- బెండకాయలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. బెండకాయతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేము. బరువు తగ్గాలనుకునేవారికి బెండకాయ బెస్ట్‌ ఆప్షన్‌గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.