ఇంటర్నెట్‌డెస్క్ : బంగాళదుంపల్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. పొటాటో చిప్స్.. కర్రీ వీటిని పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. అయితే పొటాటోస్‌ని ఎక్కువ తినడం వల్ల మధుమేహస్తులకి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపల్ని తినడం వల్ల... టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి 21 శాతం మేర వారి ఆరోగ్యానికి చేటు చేసే అవకాశముందని వైద్యులు సూచిస్తున్నారు.
- బంగాళదుంపల్లో పొటాషియం, విటమిన్స్ బి, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. వీటివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశముందని వైద్యులు సూచిస్తున్నారు.
- పొటాటోస్‌ని ఎంతో ఇష్టపడే మధుమేహస్తులు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. పొటాటో ఫ్రై లేదా, మెంతికూరతో కలిపి వండితే వాటిల్లో ఉన్న కార్బోహైడ్రేట్లు కొంతవరకు తగ్గుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బంగాళదుంపల్ని మితంగానే తీసుకోవాలి. ఉడికించిన పొటాటోస్‌ని లేదా మెంతికూరతో కలిపి వండుకున్న కర్రీని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.