టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా 'తలైవా 170' సినిమా తొలి షెడ్యూల్ తిరువనంతపురంలో ప్రారంభమైంది. రజనీకాంత్ అభిమానులు వందలాదిగా చిత్రీకరణ జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. దీంతో ఆయన వాళ్లందరికీ కనిపించి అభివాదం చేశారు. ఫ్యాన్స్ 'తలైవా' అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి నటించనున్నారు. మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ హీరోయిన్లు ఉంటారని చిత్రబృందం గతంలో ప్రకటించింది.










