Oct 18,2023 19:20

హీరో సిద్దు జన్నలగడ్డ నటిస్తున్న సినిమా షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో నాని ముహూర్తం షాట్‌కి క్లాప్‌ ఇవ్వగా, హీరోలు నితిన్‌, ఆది పినిశెట్టి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్‌ చేయగా, తొలి షాట్‌కు హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. ఆది, నందినిరెడ్డి, కోన వెంకట్‌, వక్కంతం వంశీ, బమ్మరిల్లు భాస్కర్‌, మల్లిక్‌ రామ్‌, సితార నాగ వంశీ, నిర్మాత విజయేందర్‌ రెడ్డి తదితరులు పాల్గన్నారు. భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభట్ల సహ నిర్మాత. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. థమన్‌ ఎస్‌ సంగీతం, యువరాజ్‌ జె ఛాయాగ్రహణం అందిస్తున్నారు.