
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎస్‌టి కమిషన్‌గా ఛైర్మన్ దాడిచిలుక వీర గౌరీ శంకరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందరురోడ్డులో ఉన్న ఆర్‌అండ్‌బి బిల్డింగ్‌లోని ఎస్‌టి కమిషన్ కార్యాలయంలో ఆయనతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకూ ఎస్‌టి కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న రవిబాబు ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆయన స్థానంలో శంకరరావును నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఎమ్మెల్యే బాగ్యలక్ష్మి తదితరులు అభినందించారు. డివిజిది పార్వతీపురం జిల్లా సాలూరు మండలం పాలికవలస. 1999లో పార్వతీపురం నుండి తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపిగా గెలిచిన శంకరరావు 2021లో వైసిపిలో చేరారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరి జనుల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, అనధికారులు ఆయన్ను అభినందించారు.