Jul 24,2023 11:09

కోల్‌కతా : మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన ఘటన అమానుషమని పౌర హక్కుల కార్యకర్త ఐరోన్‌ షర్మిల అన్నారు. శనివారం బెంగళూరులో పిటిఐకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఘటన వీడియో చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. సిఎం బీరేన్‌సింగ్‌ తన వైఫల్యాన్ని అంగీకరించి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మణిపూర్‌లో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మణిపూర్‌లో రాష్ట్రప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేనప్పుడు ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.