ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : ఒకవైపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతో కాస్తున్న ఎండలకు ఉక్కిరి బుక్కరవుతున్న తరుణంలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు చుక్కలు చూస్తున్నారు. ఒకపక్క పనిచేయని సర్వర్లు, మరో ప్రక్కన ఓపి చీటీ లేకపోతే ఎక్కడికి వెళ్లాలో తెలియని ప్రజలకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎండలో నిరీక్షిస్తూ క్యూ లైన్ లోనే గంటల తరబడి నిలిచిన ఉన్నారు. అత్యవసర విభాగం వద్ద ఇవ్వాల్సిన ఓపి చీటీలు ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో, రోజు 5000 నుంచి 6000 మంది ఆసుపత్రికి వచ్చే రోగులు పరిస్థితి అగమ్య గొచనంగా మారిందనే చెప్పాలి. వేసవి దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తేనే గానీ, రోగుల ఇక్కట్లు తప్పేలా లేవని పలువు అవేదన వ్యక్తం చేస్తున్నారు.










