Jun 21,2023 13:14

గుంటూరు : నిజాంపట్నం మండలం అడవులదీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలో ఒక యువకుడు మృతి చెందిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

2016లో అడవులదీవిలో రేపల్లెకు చెందిన జాస్మిన్‌ మృతికి శ్రీసాయి సహా మరో యువకుడు కారణమని భావించిన గ్రామస్తులు వారిద్దరినీ చెట్టుకు కట్టేసి కొట్టారు. గ్రామస్తుల దాడిలో శ్రీసాయి అనే యువకుడు మృతి చెందాడు. అప్పట్లో ఈ వార్త సంచలనం రేకెత్తించింది. ఈ కేసు విచారణలో భాగంగా... ఈరోజు న్యాయమూర్తి మాలతి సంచలన తీర్పును వెలువరించారు. మొత్తం 21మంది నిందితుల్లో 4 గురు ఇప్పటికే మృతి చెందారు. మిగిలిన 17 మందిలో 4 గురికి కేసు నుండి రిలీఫ్‌ చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 13 మందిని నిందితులుగా తేలుస్తూ జిల్లా న్యాయమూర్తి జి.మాలతి యాజవజ్జీవ శిక్ష విధించారు.