May 21,2023 12:35

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ సిపిఐ రాష్ట్ర నాయకులు, రైతు సంఘం నాయకులు కొల్లినాగేశ్వరావు మూడో వర్ధంతి సందర్భంగా... ఆదివారం చోడవరంలో నేతలు జోహార్లు అర్పించారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో చోడవరం మండలం అంకుపాలెం కాలనీలో సీనియర్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, రైతు సంఘం నాయకుడిగా కొల్లి నాగేశ్వరావు ఉన్నారు. అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. రైతుల హక్కుల గురించి ఎనలేని కఅషి చేసి పోరాడారని, ఆయన జీవితమంతా కమ్యూనిస్టు పార్టీకి, రైతు సంఘము ద్వారా రైతులకు హక్కులు కల్పించడంలోనే గడిచిందని.. పోరాటం చేస్తూ కన్నుమూశారని తెలిపారు. ఆయన ఆశయాలని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్వారపూడి నాగేశ్వరరావు, మేడిశెట్టి శ్రీనివాసరావు, బొడ్డు చిన్నారావు, రైతు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.