చినుకులు పడుతున్న వేళ వేడి వేడిగా గుగ్గిళ్లు తింటే... వావ్.. అనాల్సిందే.. అందులోనూ పిల్లలంతా ఎంతో ఇష్టంగా తినేవి ఈ గుగ్గిళ్లు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. స్నాక్స్‌లానూ బాగుంటాయి. కోడిగుడ్ల కన్నా బలవర్థకమైన ఆహారం గుగ్గిళ్లేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్న మాట. రోజూ కోడిగుడ్డు తినాలన్నా చాలా ఖర్చవుతుంది. అదే గుగ్గిళ్లయితే ఇంటిల్లిపాదీ తినొచ్చు. అవి అలసందలైనా.. ఉలవలైనా.. శనగలైనా.. వేరుశనగలైనా.. ఏవైనా గుగ్గిళ్లుగా చేసుకుంటే ఆ రుచే వేరబ్బా.. ఎలా తయారుచేయాలో చూద్దాం..
వేరుశనగలతో..
కావల్సిన పదార్థాలు : వేరుశనగలు - కప్పు, నీళ్లు - కప్పున్నర, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - స్పూన్, నూనె- తగినంత, ఎండుమిర్చి -1, ఉప్పు, - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు -5, ఆవాలు, జీలకర్ర - కొద్దిగా.
తయారీ విధానం : వేరుశనగలను ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టాలి. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో కప్పు నీళ్లు పోసుకుని, కొద్దిగా ఉప్పు వేసి, ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అందులో నీటిని వడగట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని తగినంత నూనె వేసుకుని, వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడుతుంటే, ఎండుమిర్చ తుంపి వేయాలి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా చితక్కొట్టి వేయాలి, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక కరివేపాకు వేయాలి. చివరిగా ఉడకబెట్టిన వేరుశనగలను వేసి రెండునిమిషాలు వేయించాలి. అంతే వేరుశనగలతో గుగ్గిళ్లు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చి వేరుశనక్కాయలు (తంపడ వేసుకున్నట్లు) తిన్నట్లే ఉంటాయి.
శనగలతో..
కావల్సిన పదార్థాలు : శనగలు - (నల్లవి / తెల్లవి) కప్పు, నీళ్లు - తగినన్ని, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - స్పూన్, నూనె- తగినంత, ఎండుమిర్చి -1, ఉప్పు, - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు -5, ఆవాలు, జీలకర్ర - కొద్దిగా.
తయారీ విధానం : తెల్ల శనగలు అయితే ఆరు గంటలు, నల్ల శనగలు అయితే నాలుగు గంటలు నానబెట్టాలి. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో కప్పు నీళ్లు పోసుకుని, కొద్దిగా ఉప్పు వేసి, ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అందులో నీటిని వడగట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని తగినంత నూనె వేసుకుని, వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడుతుంటే, ఎండుమిర్చ తుంపి వేయాలి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా చితక్కొట్టి వేయాలి, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక కరివేపాకు వేయాలి. చివరిగా ఉడకబెట్టిన శనగలను వేసి రెండునిమిషాలు వేయించాలి. అంతే శనగలతో గుగ్గిళ్లు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తింటే చలాకీగా ఉంటారు.
అలసందలతో..
కావల్సిన పదార్థాలు : అలసందలు - (తెల్లవి / ఎర్రవి) కప్పు, నీళ్లు - తగినన్ని, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - స్పూన్, నూనె- తగినంత, ఎండుమిర్చి -1, ఉప్పు, - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు -5, ఆవాలు, జీలకర్ర - కొద్దిగా.
తయారీ విధానం : తెల్ల అలసందలు అయినా, ఎర్ర అలసందలైనా ఏవైనా బాగుంటాయి. వీటినే బొబ్బర్లు అనీ పిలుస్తారు. వీటిని రెండు గంటలు నానబెట్టాలి. త్వరగానే నానతాయి. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా నీళ్లు పోసుకుని, కొద్దిగా ఉప్పు వేసి, ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అందులో నీటిని వడగట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని తగినంత నూనె వేసుకుని, వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడుతుంటే, ఎండుమిర్చ తుంపి వేయాలి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా చితక్కొట్టి వేయాలి, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక కరివేపాకు వేయాలి. చివరిగా ఉడకబెట్టిన అలసందలను వేసి రెండునిమిషాలు వేయించాలి. అంతే అలసందలతో గుగ్గిళ్లు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
ఉలవలతో..
కావల్సిన పదార్థాలు : ఉలవలు - కప్పు, నీళ్లు - కప్పున్నర, ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - స్పూన్, నూనె- తగినంత, ఎండుమిర్చి -1, ఉప్పు, - తగినంత, కరివేపాకు - రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు -5, ఆవాలు, జీలకర్ర - కొద్దిగా.
తయారీ విధానం : ఉలవలు నాలుగు నుంచి ఆరు గంటలు నానబెట్టాలి. వీటిని ప్రెషర్ కుక్కర్‌లో కప్పున్నర నీళ్లు పోసుకుని, కొద్దిగా ఉప్పు వేసి, ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అందులో నీటిని వడగట్టుకోవాలి. ఈ నీటితో చారు చేసుకోవచ్చు. వృథా పోవు. ఒక పాన్ తీసుకుని తగినంత నూనె వేసుకుని, వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడుతుంటే, ఎండుమిర్చ తుంపి వేయాలి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా చితక్కొట్టి వేయాలి, ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేగాక కరివేపాకు వేయాలి. చివరిగా ఉడకబెట్టిన ఉలవలని వేసి రెండునిమిషాలు వేయించాలి. అంతే ఉలవలతో గుగ్గిళ్లు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.