ప్రజాశక్తి : చీరాల (బాపట్ల) : ప్రజా పంపిణీ బియ్యాన్ని పేదలకు అందించకుండా పక్క దారిలో చీకటి వ్యాపారాలకు పాల్పడుతున్న రేషన్ మాఫియా గుట్టు రట్టయ్యింది. సోమవారం చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను చీరాల మండలం ఈపురిపలెంలో అదుపులోకి తీసుకొని బియ్యం రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వాహనంలో ఉన్న సుమారు 65 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న తెల్లమీకల రాఘవ, గాజుల వెంకటేశ్వర్లు, గుదంటి కేశవరావు, అనే ముగ్గురు వ్యక్తులను సిఐ మల్లికార్జున్ రావు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.










