Aug 26,2023 16:37

ప్రజాశక్తి -తాళ్లరేవు (కాకినాడ) : జార్జిపేట పంచాయతీ సర్పంచ్‌గా గుత్తుల సత్యవేణి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా శనివారం పంచాయతీలో కార్యదర్శి వరలక్ష్మి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించి నూతన సర్పంచ్‌గా గుత్తుల సత్య వేణిచే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. 8 వ వార్డు సభ్యురాలుగా పనిచేసిన సత్యవేణి ఆ పదవికి రాజీనామా చేసి సర్పంచ్‌గా అత్యధిక మెజార్టీతో ఎన్నికవడంతో వార్డు సభ్యులు చింతా భాగ్యలక్ష్మి, కే.వి.వి. సుబ్రహ్మణ్యం, గాలి దేవర సీతాదేవి, శీలి రాజు, రాయుడు సత్యనారాయణ, ఎంపీటీసీ మందపల్లి నాగమ్మ అభినందనలు తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో టిడిపి నాయకులు నూతన సర్పంచ్‌ సత్యవేణి, ఆమె భర్త సూరిబాబు ని పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కడలి శ్రీనివాస్‌, పెంకె ఏడుకొండలు, పెదపాటి కామేశ్వరరావు, పొన్నమండ రామలక్ష్మి, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, మోపూరి వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, బోయిడి వేణుగోపాల్‌, జనసేన పార్టీ మండల కన్వీనర్‌ అత్తిలి బాబురావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు, వైసిపి నాయకులు మందపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.