Oct 20,2023 19:20

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి, రుక్మిణీ వసంత్‌ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'సప్త సాగరాలు దాటి'. ఈ సినిమా సీక్వెల్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హేమంత్‌ ఎం.రావు దర్శకత్వం వహించారు. గత నెలలో ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'సప్తసాగరాలు దాటి సైడ్‌ బి' నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో విడుదల కానుంది.