
ప్రజాశక్తి - విజయవాడ రూరల్ : వికాస్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముగ్గుల పోటీలు, పిండి వంటలు, సాంస్కృతిక కార్యక్రమలలో విద్యార్థులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎన్.నర్సిరెడ్డి, కళాశాల వైస్ చైర్మన్ ఎన్.సత్యన్నారాయణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ బి.రమణ, వికాస్ కల్చరల్ క్లబ్ చీఫ్ కోఆర్డినేటర్ కెకెడి వరప్రసాదరావు, కల్చరల్ క్లబ్ కోఆర్డినేటర్స్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, మన సంప్రదాయం, సంస్కృతి మీద విద్యార్థులకు అవగాహనను పెంపొందించవచ్చునని అభిప్రాయపడ్డారు. వైస్ చైర్మన్ ఎన్ సత్యన్నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు పలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. తెలుగు సంప్రదాయ వంటకాలపట్ల అవగాహన కల్పించుటకు పలు పోటీలను నిర్వహించినట్లు చెప్పారు.