Nov 22,2023 10:48

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో 'దేవర' రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఓ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు సంజయ్ దత్‌ను సంప్రదించారని సమాచారం. ఈ చిత్రంలో ఇప్పటికే సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా ఎంపికయ్యారు. మరి సంజరు ఎలాంటి పాత్రలో కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. 'దేవర'ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. పార్ట్‌ 1 వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఇప్పటికే దక్షిణాది చిత్రాలైన 'కేజీఎఫ్‌', 'లియో' చిత్రాల్లో సంజయ్ దత్‌ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే !