
అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషయంలో ఆమె తన ఆహార వ్యవహారాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. ముఖ్యంగా వైద్యుల సలహా మేరకు నచ్చిన ఆహారాన్ని దూరంగా పెట్టినట్లు సమాచారం. నట్స్, బంగాళాదుంప, టమాట, గుడ్లు, పాలు వంటి పదార్థాలకు చాలాకాలంగా దూరంగా ఉంటున్నారు. ఎంతో ఇష్టమైన బ్రెడ్, బట్టర్, జామ్ కూడా తీసుకోకుండా కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేశారు. 'చాలా రోజుల తరువాత నాకు ఇష్టమైన బ్రెడ్, బట్టర్, జామ్‌ను ఆహారంగా తీసుకుంటున్నాను' అంటూ ఫొటో కింద రాసుకొచ్చారు. ఇది చూసిన సమంత అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమె ఆరోగ్యం కోలుకుంటున్నట్లే అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.