Oct 12,2023 19:11

వెంకటేష్‌ హీరోగా హిట్‌ వెర్స్‌ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ 'సైంధవ్‌'. జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తికాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం టీజర్‌ను 16న విడుదల చేయనున్నట్లు చిత్రనిర్మాతలు ప్రకటించారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌ నటించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు. ఎస్‌ మణికందన్‌ డీవోపీగా పని చేస్తున్నారు. గ్యారీ బిహెచ్‌ ఎడిటర్‌, అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌. కిషోర్‌ తాళ్లూరు సహ నిర్మాత.