
బీటలు తీసిన భూమిపై
బరువైన గుండెతో
భారమైన గతంతో
కొత్త ఆశలకై బాటలు వేస్తూ
నాగలి చేతపట్టి
దుక్కి దున్నాలి
అనే ఆలోచన
ఈ సంవత్సరం రైతుది
అవ్వాలని ఆశ
ఆదాయం లేక, అలమటిస్తున్న
తన కుటుంబంకోసం చూస్తూ
గడప దాటి
గాలి ధూళిని తట్టుకొని
తన రెక్కలు రాబోయే కాలానికి
బలి అవ్వబోతున్నాయి అని తెలుసు
నీరసించినా, నమ్మకం ఉన్న ఆ కన్ను
ఆకాశాన్ని అడిగింది
ఆ క్షణం, తన తొలిమెట్టు మొదలయ్యింది
పసివాడి బోసి నవ్వు
ఎండిపోయిన పెదాలపై మెరిసింది
మేఘాలు కరగబోతున్నాయి
అని తెలిసింది
తొలిజల్లుతో తన భూమి తడవబోతున్నట్టు కనిపించింది
మొక్క భూమిని చీల్చి
పైకి, ఎదగడం గుర్తొచ్చింది
ఈ సంవత్సరం తనది
అని అనిపించింది
మట్టివాసన వచ్చి చెప్పింది
పి.చిన్మయి, 10వ తరగతి,
వి. పి. సిద్ధార్థ పబ్లిక్ స్కూలు, విజయవాడ.
8374996653