బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం'లో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, రావణుడి పాత్ర కోసం యష్ నటిస్తున్నారని తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం సీత పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవలే సాయి పల్లవి లుక్ టెస్ట్‌లో పాల్గన్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోసం సాయి పల్లవి బల్క్ డేట్స్ కేటాయించారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జులైలో యష్ సెట్స్‌లోకి జాయిన్ అవుతాడు. ఈ సినిమా కోసం మేకర్స్, టాప్ హాలీవుడ్ స్టూడియోస్‌తో కలసి పని చేస్తున్నారు. మొదటి భాగం షూటింగ్ ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.










