ముళ్ళకొమ్మల మధ్య ముద్దులొలికేటి
సుందర, సుకుమార, ముగ్ధ మనోహర
గులాబీ కుసుమ సదృశం
అవనితోటలో సగమైన అతివ జీవితం.
దినకర మయూఖాలతో పోటీపడుతూ
ఉషోదయం కాకమునుపే
కార్యదీక్ష ప్రారంభించే కలకంఠి,
అనుబంధాల పందిళ్లను
లతలా అల్లుకుపోతూ,
అలసటను ఆత్మవిశ్వాసంతో
సేద తీర్చుకుంటూ,
గ్రీష్మతాపాన్ని లోలోపల అణచుకొని
శరజ్జ్యోత్స్నలు పంచుతుంది.
సమస్యల వలయాన్ని
సమయస్ఫూర్తితో ఛేదిస్తూ,
వడగాడ్పులను స్వీకరించి
హేమంత తుషారాల హాయిని నింపే
అతివకు కాదేదీ అసాధ్యం.
ఓ లలనా!
ఆకాశాన్ని చుంబించే ఆత్మశక్తితో,
ఆధునికతను ఒడిసిపట్టే శక్తియుక్తులతో,
విజ్ఞానాయుధాన్ని చేపట్టి,
ప్రగతి రథసారథిóవైన నీవు,
ఈ జగతికి నీ పురోగమనాన్ని
సుస్వర సుమధుర కావ్యంగా లిఖిస్తూ,
మానవత్వం గుబాళించే మంచిమనసుతో
మహిళాసాధికారత సాధనలో సాగిపో...
వేమూరిశ్రీనివాస్
99121 28967