బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి మూడేళ్లుకావస్తోంది. నేటీకీ ఆ కేసు మిస్టరీగానే ఉంది. ఈ విషయంలో రియా చక్రవర్తి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మీడియాకు దూరంగా ఉన్న ఆమె తాజాగా ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన సందర్భంలో మాట్లాడారు. 'మనం మనుషులం కాబట్టి జీవితంలో ఏది జరిగినా ముందుకు సాగక తప్పదు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను. ఆ విషాదం నుంచి నేను మామూలు మనిషిని కావడానికి చాలా సమయం పట్టింది. మీడియాలో నాపై ఎన్నో కథనాలు వచ్చాయి. వాటి వల్ల చాలా నష్టపోయాను. ఏడవడానికీ వాళ్లు నాకు సమయం ఇవ్వలేదు. సుశాంత్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నా జీవితమంతా అతడిని మిస్ అవుతూనే ఉంటాను. నాన్న భారత సైన్యంలో పనిచేశారు. కష్టాలకు కృంగిపోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలని ఆయన మాకు నేర్పారు. జీవించాలనే సంకల్పం చాలా పెద్దది' అని పేర్కొన్నారు.










