Oct 17,2023 12:02

ప్రజాశక్తి - కలకడ (రాయచోటి-అన్నమయ్య) : బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని ఎస్‌ఐ తిప్పేస్వామి సచివాలయ మహిళా పోలీసులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన కలకడ పోలీస్‌ స్టేషన్‌ లో సచివాలయ మహిళా పోలీసుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ... సచివాలయ పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో బాల్యవివాహాలను ప్రోత్సహించిన, సహకరించినవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో వివాహ వయసు రాకమునుపే పెళ్లిళ్లు చేయడం పరిపాటిగా ఉందని, ఈ విషయాలను సంబంధిత వాలంటీర్లతో అంగన్వాడి సిబ్బందితో చర్చించి విషయం కనుగొని సంబంధిత అధికారులకు తెలియజేసే బాధ్యత సచివాలయ పోలీసులకు ఉందని గుర్తు చేశారు. డ్రగ్స్‌ తయారు చేయడం, నాటు సారా తయారు చేసి అమ్మకాలు చేయడం గ్రామాలలో ఎక్కడైనా జరిగితే తమ దఅష్టికి తీసుకురావలసిన అవసరం ఉన్నదన్నారు. సైబర్‌ క్రైములు, వరకట్న వేధింపులు, మహిళలపై గఅహహింస అలాంటివి జరిగితే స్థానిక పోలీస్‌ స్టేషనుకు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడపడం, వాహనములకు సరైన రికార్డులు లేకపోవడం, చిన్న వయసున్న పిల్లలు వాహనాలు నడపడం వంటివి ఎవరైనా చూస్తే వెంటనే తెలియజేయాలని ఎస్సై సచివాలయ మహిళా పోలీసులకు సూచనలు సలహాలు అందించారు. గ్రామీణ ప్రాంతాలలో పరిచయము లేని వ్యక్తులు, గుర్తుతెలియనివారు వస్తే తెలియజేయాలన్నారు. గ్రామాల్లో దసరా సెలవుల సందర్భంగా ఊర్లకు వెళ్లేవారి ఇండ్ల సమాచారాన్ని సేకరించి చోరీలు జరగకుండా నియంత్రించవలసిన బాధ్యత సచివాలయ మహిళా పోలీసులపై ఉందని ఎస్‌ఐ తెలిపారు.