Sep 13,2023 13:48

కాకినాడ : ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి సంగ్రమం సైకిల్‌ యాత్ర నేడు 6వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్‌ లో ఉన్న ఎపిఎస్‌పి హై స్కూల్‌ లో సైకిల్‌ యాత్ర ప్రారంభమయ్యింది. అనంతరం సభ నిర్వహించారు. బోట్‌ క్లబ్‌ హై స్కూల్‌ , ఐడిఈఎఎల్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ , గవ్నమెంట్‌ ఐటిఐ కళాశాల, ఎఎఫ్‌సి హై స్కూల్‌ వద్ద సభలు నిర్వహించారు.