ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో వేగవంతంగా నిర్మాణం అవుతున్న సబ్ కోర్టు, ఏడిఎం కోర్టులను ఆర్ అండ్ బి ఎస్ సి జాన్ మోషే, ఆర్ అండ్ బి ఈ ఈ కృష్ణ నాయక్ లు శనివారం పరిశీలించారు. అధికారులకు కాంట్రాక్టర్ వెంకట్రావు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెకంటి జీవరత్నం, ఆర్ అండ్ అధికారులతో కలిసి బిల్డింగ్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ శ్రీరామూర్తి, ఏజీపి మట్టప్రసాద్, సీనియర్ న్యాయవాదులు బండారు సుధాకర్, బొందలపాటి రామకృష్ణ, మన్నే నారాయణ, హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.










