
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు మధ్యంతర బెయిల్‌ని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1వరకు పొడిగించింది. వైద్య కారణాలపై సెప్టెంబర్ 1 వరకు మధ్యంతర బెయిల్‌ను జైన్‌కు పొడిగిస్తున్నట్లు ఎ.ఎస్ బోపన్నా, ఎం.ఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జైన్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి అతని ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు వివరించారు. జైన్‌కు తీవ్రమైన అనారోగ్య కారణాలున్నాయని, ఫిజియోథెరపి చికిత్స అవసరమని అభిషేక్ కోర్టుకు తెలిపారు. సత్యేందర్‌కు జులై 21వ తేదీన శస్త్ర చికిత్స జరిగింది. దీంతో తనకున్న అనారోగ్య పరిస్థితుల కారణంగా మధ్యంతర బెయిల్‌ను సుప్రీం పొడిగిస్తోంది.