
అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్లపై హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామన్నారు. దీంతో సిఐడి, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఈ పిటిషన్లపై బుధవారం మధ్యాహ్నం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.