Apr 13,2023 15:42

ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌): రెడ్డిగూడెం మండల పరిధిలోని మైలవరం - విస్సన్నపేట మధ్య గల మద్దుల పర్వ గ్రామం వద్ద తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. గత కొంతకాలంగా ఇక్కడ రోడ్డు పాడైపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ఉండేది మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌తో చర్చించి రూ.25 లక్షలతో పనులు చేపట్టినట్లు జెడ్పిటిసి సభ్యులు పాలంకి విజయ భాస్కర్‌ రెడ్డి తెలిపారు. రెడ్డిగూడెం నుండి విస్సన్నపేట వరకు తారు రోడ్డు పూర్తి చేసేందుకు 30 లక్షల రూపాయలు అంచనాలు వేసి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కి పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.