Sep 13,2023 14:45

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జి బత్యాల చెంగలరాయుడు ఆధ్వర్యంలో బుధవారం ఆర్‌ ఎస్‌ రోడ్డులో టీడీపీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా బత్యాల మాట్లాడుతూ.. మచ్చ లేని తమ నాయకుడు చంద్రబాబు పై అక్రమ కేసు బనాయించి రిమాండుకు పంపడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా అనేకమంది యువత శిక్షణ పొంది ఉపాధి పొందారని, నిరాధార ఆరోపణలు నుండి బాబు త్వరలోనే మచ్చలేని నాయకుడిగా తిరిగి బయటకొస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్‌ రాజు, మండల రూరల్‌ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్య నాయుడు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, మహిళా నాయకురాలు అనసూయమ్మ, పత్తిపాటి కుసుమకుమారి, జ్యోతి శివ తదితరులు పాల్గొన్నారు.