Mar 28,2023 15:23

ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : పెద్దాపురం మండలం రాయ భూపాలపట్నంలో సమస్యలను పరిష్కరించాలని గ్రామ సచివాలయం అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ సాగర్‌కు టిడిపి నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం టిడిపి మండల కమిటీ సభ్యుడు మన్యం ప్రసన్నకుమార్‌,గ్రామ కమిటీ అధ్యక్షుడు సానిపిని సురేష్‌లు మాట్లాడుతూ.. గ్రామ పరిధిలో వీధిలైట్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. చీకటి పడితే అనేక ప్రాంతాల్లో అంధకారం రాజ్యమేలుతుందని, అనేక వీధుల్లో డ్రైన్లు మట్టితో పూడుకు పోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని తెలిపారు. వీధి కులాయిల లీకుల వల్ల తాగునీరు వృధాగా పోతుందన్నాయని, ఎస్సీ పేటలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ సమస్యలన్నీ వేగవంతంగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెనుమర్తి సుధీర్‌, నవీన్‌, చావా చౌదరి, త్రినాధ్‌ తదితరులు పాల్గొన్నారు.