Dec 30,2022 11:19

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : మండల పరిధిలోని స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద శుక్రవారం ఉదయాన్నే రైల్వే స్థలంలో గత 40 ఏళ్ల నుండి నివసిస్తున్న 34 గృహాలను తొలగించారు. ఈ సందర్భంగా బాధితులు ఇళ్లల్లోని సామానులను అప్పటికప్పుడు దక్కించుకోవడానికి నానాఅవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ మణికంఠ మాట్లాడుతూ ... బాధితులకు మూడుసార్లు చట్టపరంగా నోటీసులు జారీ చేశామన్నారు బాధితులు స్పందించకపోవడం వలన ఉదయాన్నే రైల్వే పోలీసులు, సివిల్‌ పోలీసులు ప్రొడక్షన్‌తో ఆక్రమణలు తొలగించే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. బాధితులందరూ గత నలభై ఏళ్ల నుండి అక్రమ భవనాలను నిర్మించుకొని జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. దాదాపు 34 ఇళ్ళను కూల్చివేసేందుకు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రైల్వే సిఐ వి.శ్రీనివాసరావు, చీరాల రూరల్‌ సిఐ ఏ.మల్లికార్జున రావు ఆధ్వర్యంలో రైల్వే ఎస్సైలు సివిల్‌ ఎస్సై జి.సురేష్‌ లు గట్టి బందోబస్తు నిర్వహించారు.