Oct 26,2023 19:30

అల్లు ఫ్యామిలీ సొంత ప్రొడక్షన్‌ అయిన అల్లు ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న బాలీవుడ్‌ చిత్రం 'త్రీ ఆఫ్‌ అస్‌'. బాలీవుడ్‌ నటి షెఫాలీ షా, 'పాతాల్‌ లోక్‌ ఫేమ్‌' జైదీప్‌ అహ్లావత్‌, స్వానంద్‌ కిర్కిరే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అవినాష్‌ అరుణ్‌ ధావేర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 2022లోనే షూటింగ్‌ ముగించుకున్న ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్‌ గమనిస్తే మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో విడిపోయిన స్నేహితులు 17 ఏండ్ల తర్వాత కలుసుకున్నాక వారి జీవితాల్లో ఏ జరిగింది అనేది స్టోరీ. లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ అల్లు అరవింద్‌ సమర్పణలో నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఇండియన్‌ పనోరమా 2022 కోసం ఎంపిక చేసిన 25 చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా చోటు దక్కించుకుంది.