Oct 21,2023 19:20

పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'మంగళవారం'. అజరు భూపతి దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం. కన్నడ, హిందీ భాషల్లో నవంబర్‌ 17న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేశారు. ట్విట్టర్‌ వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.