Sep 16,2023 20:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 1998 డిఎస్‌సి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద రిలే దీక్షలను నాలుగో రోజు శనివారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, కోస్తాంధ్ర సమితి అధ్యక్షులు సవ్వేపల్లి సుదర్శన్‌, మున్సిపల్‌ స్టేట్‌ ఎంప్లాయీస్‌ నాయకులు కె సురేంద్ర పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియచేశారు. ఈ సందర్భంగా వి వెంకటేశర్లు మాట్లాడుతూ.. డిఎస్‌సిలో అన్యాయం జరిగి, నష్టపోయిన అభ్యర్థులకు ఎస్‌జిటి పోస్టులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమస్యపై దృష్టిసారించాలన్నారు. అభ్యర్థులందరికీ మినిమం టైంస్కేల్‌ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యపై అసెంబ్లీలో చర్చ జరిగేలా ఎమ్మెల్యేలు, పార్టీలను కలుపుకుని వారి మద్దతు కోరుతామన్నారు. ఈ దీక్షలో శ్రీనివాసులు, మేరి సుహసిని, రమేష్‌, సరోజ, శ్రీదేవి, ఆదాం, సరస్వతి, కెవి రమణ, అబ్దుల్‌ సాహెబ్‌, పార్ధసారథి, లక్ష్మయ్య, ఏసుబాబు, జ్యోతి, అరుణ, రత్నకుమారి, మేరీ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.