Oct 07,2022 07:04

తి త్వరలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం మేఘాలు ఆవరిస్తాయని ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) సహా అనేక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 2008లో అమెరికా పరపతి విధానం ఫలితంగా ప్రపంచాన్ని మాంద్యం చుట్టుముట్టగా ఉద్దీపన పథకాలతో తాత్కాలికంగా సమసిపోయిందనిపించారు. పూర్తి స్థాయిలో అంతం కాలేదు. ఏదోక మూలన ఏదొక రూపంలో మాంద్యం కనిపిస్తూనే ఉంది. దాని ప్రభావానికి ప్రజలు గురవుతూనే ఉన్నారు. కరోనాకు ముందు నుంచే ఉగ్గపట్టుకున్నట్లున్న మాంద్యం మహమ్మారి సృష్టించిన విలయానికి పెరుగుదల బాట పట్టింది. అధ్యయన సంస్థలు వరుసగా అదే చెబుతున్నాయి. వచ్చే ఏడాది ప్రపంచ వాణిజ్యం ఒక శాతానికి తగ్గుతుందని తాజాగా డబ్ల్యుటిఒ పేర్కొంది. ప్రపంచ వాణిజ్యంలో వృద్ధిరేటు 3.5 శాతంగా ఇంతకుముందు అంచనా వేసింది. కాగా మొన్న ఏప్రిల్‌కు 3 శాతానికి పడిపోయింది. అందుకే వాణిజ్యం ఒక శాతానికి దిగజారుతుందని తెలిపింది. ప్రస్తుతం వాషింగ్టన్‌లో జరుగుతున్న ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ కాన్ఫరెన్స్‌ సైతం ఇదే మాదిరి సంకేతాలిచ్చింది. అమెరికా సహా సంపన్న, సామ్రాజ్యవాద దేశాల ఆర్థిక వ్యవస్థల్లో మార్పులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం మాంద్యానికి హేతువులుగా పేర్కొంది. ఈ వక్కాణింపులు రాబోయే ముప్పునకు ప్రమాద ఘంటికలు.
        భారతదేశం విషయానికొస్తే స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి వచ్చే ఏడాది 7 శాతంగా అంచనా వేయగా, ఆ మరుసటి సంవత్సరం 6.1 శాతంగా ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. ఐఎంఎఫ్‌ అయితే 8.7 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. మన జిడిపి వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతం ఉంటుండగా ఆ మరుసటి ఏడాది 5.7 శాతానికి దిగజారుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన అన్‌క్టాడ్‌ వెల్లడించింది. ఈ ప్రభావంతో ధరలు పెరిగి ప్రజల ఖర్చులు పెరుగుతాయనీ హెచ్చరించింది. ఇదే సమయంలో ప్రపంచ జిడిపి 2.6 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గుతుందని తెలిపింది. బహుళజాతి సంస్థలకు లీడర్లుగా వ్యవహరించే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారుల (సిఇఒ) మనోగతంపై కెపిఎంజి సంస్థ నిర్వహించిన సర్వేలో సైతం ప్రపంచం మాంద్యం వైపు పయనిస్తోందని వెల్లడైంది. రాబోయే 12 నెలల్లో మాంద్యం వస్తుందని 86 శాతం మంది సిఇఒలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వాణిజ్యం తగ్గుతుందన్న సంకేతాలు, ఎగుమతులను పెంచుకోవాలని చూస్తున్న ఇండియాకు నిరాశాజనకం. మన వాణిజ్య మంత్రిత్వశాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారమే ఇంజనీరింగ్‌, రెడీమేడ్‌ దుస్తులు, టెక్స్‌టైల్స్‌, బియ్యం ఎగుమతులు 3.52 శాతం తగ్గాయి. వాణిజ్యలోటు 26.72 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇంధనం, ఆహారం, ఎరువుల దిగుమతి బిల్లులు పెరగడం వలన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రత, రుణ సంక్షోభం తలెత్తుందని ప్రపంచబ్యాంక్‌, ఐఎంఎఫ్‌ తెలియజేశాయి. మన దిశ ఆ వైపే ఉందని సర్కారీ గణాంకాలూ కుండబద్దలు కొడుతున్నాయి.
         తాను మెచ్చిన, మాంద్యానికి ఊతమిచ్చే సంస్థలే రాబోయే ఆర్థిక ఉత్పాతంపై ఇల్లెక్కి కూస్తుండగా మోడీ ప్రభుత్వం మాత్రం వాటిని పక్కనపెట్టి, అంత జిడిపి ఇంత వృద్ధి, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ఊదరగొట్టడం ప్రజలను మోసగించడమే. 2019 ఎన్నికల నాటికే దేశంలో మాంద్యం మొదలుకాగా, బయట పడకుండా విన్యాసాలు చేసింది బిజెపి సర్కారు. ఎన్నికలయ్యాక బెయిలవుట్లు ప్రకటించింది. కరోనాలో 'ఆత్మనిర్భర్‌' ముసుగులో ప్రభుత్వ ఆస్తుల, సహజ వనరుల లూటీకి కార్పొరేట్లకు అవకాశమిచ్చింది. ఈ విధానాలతో ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయి. నిరుద్యోగం 6.3 శాతానికి ఎగబాకింది. 2017లో 29.9 శాతంగా ఉన్న ఉద్యోగిత రేటు ఇప్పుడు 10.4 శాతానికి దిగజారింది. ఉత్పత్తి, తయారీ, సేవ అన్ని రంగాల వృద్ధి పడిపోయింది. స్వదేశీ, మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటివి వాగాడంబరమేనని తేలిపోయింది. మాంద్యాన్ని ఎదుర్కోవాలంటే ప్రజల కొనుగోలుశక్తి పెంచాలి. ప్రభుత్వ ఖర్చు, సబ్సిడీలు పెరగాలి. అధిక జనాభా ఆధారపడ్డ వ్యవసాయంలో ప్రభుత్వ జోక్యం ఇతోధికంగా పెరగాలి. అంతర్గత డిమాండ్‌ను పెంచడం ద్వారానే చైనా మాంద్యం నుంచి బయటపడింది. ఆ వైపు మోడీ సర్కారు ఆలోచించకపోతే మనకూ శ్రీలంక గతే పడుతుం