తెల్లని చల్లని జాబిలమ్మని
అదనంత ఎత్తునున్న చందమామని
రా రమ్మని.. నాకు పాలబువ్వనిమ్మని..
పిలిచింది అమ్మ.. మరి అదిగో వస్తుంది..
వచ్చేసింది.. నీకు అన్నీ తెచ్చేసిందంటూ
గోరుముద్దలు తినిపించింది అమ్మ!
అల్లంత దూరాన పెద్ద మర్రి చెట్టుందనీ..
దానికింద పేదరాశి పెద్దమ్మ
నీ కోసం కబురులెన్నో.. కథలెన్నెన్నో దాచిందనీ.. కునుకు తీసేదాకా.. కథ కంచికంటూ కథలెన్నో చెప్పింది.. మా అమ్మమ్మ! ఓ చంద్రయానమా..!
దివ్యంగా దక్షిణ దిక్కున చేరావే..!
పేదరాశి పెద్దమ్మను కలిశావా..?
మన ఇంటి సింహ చిహ్నాన్ని చూపావా..?
నీ పుట్టింటి గురుతు తారకను తెలిపావా..?
పదునాల్గు రోజుల్లో.. పదనిసలెన్నో..!
మరిచిపోక తెలుసుకో మర్రిచెట్టు గుట్టేమిటో..!
ఇక ఏమేమి చెబుతావు చంద్రయానమా..!
జాబిలమ్మ గమనమా.. గగనతల రహస్యమా..!
నీ నుంచి చిత్రాలె స్వర్ణభరితాలు..
చరిత్ర కుసుమాలు మాకు! మరి కావాలి..
భవిష్య భారతావనికి నీవే తలమానికం...!
టాన్యా
7095858888